తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న(సోమవారం) శ్రీవారిని 66,503 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
- తిరుమలలో 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..
- టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 10 గంటల సమయం..
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,503 మంది భక్తులు..
- నిన్న తలనీలాలు సమర్పించిన 23,941 మంది భక్తులు..
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు