తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

-

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో చాలాా మంది పుణ్యక్షేత్రాలు, ఇతర ప్రదేశాలకు వెకేషన్లకు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎక్కువంది ఇన్నాళ్లూ పెండింగ్లో ఉన్న మొక్కులు చెల్లించుకునే పనిలో పడ్డారు. అలా పుణ్యక్షేత్రాల బాట పడుతూ ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెండింగ్లో ఉన్న లిస్టు తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోవడం. అందుకే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ షురూ కాగానే.. అంతా తిరుమల బాట పట్టారు. ఈ నేపథ్యంలో తిరుమల సన్నిధిలో రద్దీ పెరుగుతోంది.

గురువారం రోజున తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి  సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టింది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో వేచి భక్తులు వేచి చూశారు. ఇక నిన్న ఆ కలియుగ దైవాన్ని 61,492 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 27,660 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version