తిరుమల భక్తులకు అలర్ఠ్.. ఇక నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చును. తిరుమలలోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారీ దర్శనం జరుగుతోంది. 74926 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 23726 మంది భక్తులు…తలనీలాలు సమర్పించారు.
అలాగే.. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.87 కోట్లు గా నమోదు అయింది. ఇక అటు నేటి నుండి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈనెల 29 వరకూ తిరుమల తరహాలో రోజుకో వాహనం పై స్వామి వారి వాహనసేవలు ఉంటాయి. సాయంత్రం ధ్వజాహరోవణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
తొలి రోజు శేషవాహనంపై స్వామి మాడవీధులలో ఊరేగింపు ఉంటుందిజ బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో పూలతో ప్రత్యేక అలంకలణ చేస్తారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానున్నారు. అటు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.