తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 14 కంపార్టు మెంట్లలో వేచివునాన్రు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 86,604 మంది భక్తులు దర్శించుకున్నారు.
31,536 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు గా నమోదు కావడం జరిగింది. కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి లక్షల్లో జనాలు వెళుతూ ఉంటారు. రోజుకు 70 వేల నుంచి లక్ష వరకు దర్శించుకుంటూ ఉంటారు.
ఈ తరుణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 12 గంటల నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఏదో కొన్ని రోజుల్లో మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. అయితే.. తిరుమల దేవస్థానం దర్శనం కోసం వచ్చే భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. తిరుమల కొండ పైన ఉన్న.. రింగ్ రోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం… త్వరగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది.