ఇవాళ ఉదయం 11 గంటలకు CRDA 44వ అథారిటీ సమావేశం జరుగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్-10 లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటి వరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

మరో రూ.2 వేల కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలపనుంది. రెండు రోజుల్లో అమరావతిలో పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలవనుంది. అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికొకసారి ప్రభుత్వం అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.
