ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, మహిళల పై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. పండుగ వేళ చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
అయితే ఈ ఘటనలో ఇద్దరూ చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన వీరు.. సదుం మసీదు వీధిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనకు గల కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని నగరిలో కూడా ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఒకేరోజు చిత్తూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకొని నలుగురు మరణించడం గమనార్హం.