తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన వినాయక చవితి పర్వదినాన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఝాన్సీ దర్శనానికి వెళ్తూ… తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో మృతి చెందింది.

హస్పిటల్ కు తరలించే లోపు ఆ మహిళ మృతి చెందింది. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతోనే భక్తురాలు మరణించింది. దీంతో అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతోనే తమ కూతురు మృతి చెందిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లితండ్రులు. అంబులెన్స్ కోసం గంటకి పైగా వేచివున్నామని….క్యూ కాంప్లేక్స్ లో పట్టించుకునే వారు లేరని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.