ఇలా ఈజీగా వాయిస్ కమాండ్ తో ట్రైన్ టికెట్స్ ని బుక్ చెయ్యొచ్చు తెలుసా..?

-

ఇండియాలోని కస్టమర్లు ప్రస్తుతం యూపీఐ లావాదేవీలను, వాయిస్ కమాండ్లను ఉపయోగించి లేదంటే యూపీఐ ఐడి లేదా మొబైల్ నెంబర్ టైప్ చేసి ట్రైన్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఇన్ టూరిజం కార్పొరేషన్ స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అప్ కోర్ ఓవర్ గ్లోబల్ సింటెక్ ఫస్ట్ లో ఈ వాయిస్ కమాండ్ చెల్లింపు ఫీచర్ ని మొదలుపెట్టింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే.. ఈ రైలు మనం రైలు టికెట్ ని సాధారణంగా బుక్ చేసుకోవాలంటే IRCTC వెబ్సైట్ లేదంటే యాప్ ఓపెన్ చేయాలి.

అందులో డేట్ ఎంటర్ చేసి ఏ ట్రైన్ ఎక్కడికి వెళ్లాలి ఎక్కడ దిగాలి వంటి వివరాలు ఇవ్వాలి చివర్లో టికెట్ పేమెంట్ కోసం డెబిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్ కోసం ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతటినీ టైప్ చేసిన తర్వాత అప్పుడు టికెట్స్ బుక్ అవుతాయి. అయితే ఇదంతా కాకుండా వాయిస్ కమాండ్ తో ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్ పేమెంట్ కూడా చేయొచ్చు.

ఇండియాలో యూపీఐ టెక్నాలజీని నియంత్రిస్తున్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వేస్ కోర్ ఓవర్ అనే టెక్నాలజీ కంపెనీ ఈ మూడు కూడా కలిపి ముంబైలో జరిగిన గ్లోబల్ ప్రింటర్ 2024 లో ట్రైన్ బుకింగ్ కోసం వాయిస్ తో యూపీఐ పేమెంట్ చేసే విధంగా ఫీచర్ ని లాంచ్ చేయడం జరిగింది. యూపీఐ ఐడి లేదా మొబైల్ నెంబర్ ని వాయిస్ తో చెప్పి టికెట్ పేమెంట్ ఈజీగా చేయొచ్చు. ఈ సిస్టం మొబైల్ నెంబర్ తో డిఫాల్ట్ గా లింక్ ఉన్న యూపీఐ ఐడి ని కనెక్ట్ చేసాక యూపీఐ యాప్ పేమెంట్ ప్రారంభిస్తుంది. హిందీ, గుజరాతి సహా ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news