శ్రీవారి పాదపద్మాల వద్ద ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు విక్రయించనున్నట్లు టీటీడీ తెలిపింది. 5, 10 గ్రాముల బంగారు మంగళసూత్రాలను నాలుగైదు డిజైన్లలో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. తయారీకి ఎంత ఖర్చు అయిందో అదే ధరకు విక్రయిస్తామని పేర్కొంది. లక్ష్మీకాసులను కూడా విక్రయిస్తామని తెలిపింది. మత మార్పిళ్ళకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ముఖ్య0గా రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది.పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. రూ. 30కోట్లతో గోగర్భం- ఆకాశగంగ వరకు నాలుగు వరుసలు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలకమండలి అధికారులు.