తిరుమలలో కట్టిన నిర్మాణాలు సోంత పేర్లు ఉండకూడదు : టీటీడీ ఈవో

-

2019లో తిరుమల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించినా అది జరగలేదు అని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అయితే ఇప్పుడు తిరుమల అభివృద్ధి కోసం సిఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలన్నారు. 2019లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్ గురించి ఎవరికి తెలియని పరిస్థితి ‌‌ఉంది. ఒక ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదు. చారిత్రాత్మక చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు నగరంలో జరగడం లేదు‌‌. పవిత్రత అనేది లేకుండా భవన నిర్మాణాలు చేశారు‌.

అయితే తిరుమలలో కట్టిన నిర్మాణాలు సోంత పేర్లు ఉండకూడదు. టీటీడీ నుండి కోన్ని పేర్లు ఇస్తాము. ఆ పేర్లు ఆయా గెస్ట్ హౌలకు పెట్టుకోవాలి. తిరుమలలో కట్టే నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ ప్రకారం నిర్మించాలి. ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుమలలో నిర్మాణాలు కట్టరాదు. సరైన నిబంధనలు లేకుండా కట్టినవారిపై చర్యలు తీసుకుంటాం. నూతన టౌన్ ప్లాన్ విభాగాన్ని ఎర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 25 సంవత్సరాలకు సంబందించిన ఒక విజన్ డాక్యుమెంటరీ తయారు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం అని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news