తిరుమల భక్తులకు అలర్ట్..డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు దర్శనం కల్పించనున్నారు. తిరుమలలో డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 5 గంటలకు దర్శన టోకేన్లు జారీ కానున్నాయి.
తిరుపతి,చంద్రగిరి,శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి స్థానిక దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలం,రేణిగుంట మండలం,తిరుమల వాసులకు టోకెన్లు జారి చెయ్యనుంది టిటిడి పాలక మండలి. రేపు తిరుపతి మహతి వద్ద, తిరుమల కమ్యూనిటీ హాల్ వద్ద ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్లు జారీ చేయనున్నారు.
- తిరుమల…డిసెంబర్ 3వ తేదీన స్థానికుల దర్శనం
- రేపు ఉదయం 5 గంటలకు దర్శన టోకేన్లు జారీ
తిరుపతి,చంద్రగిరి,శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి స్థానిక దర్శన టోకెన్లు జారీ చెయ్యనున్న టిటిడి