తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల టైం పడుతుంది. వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల టైం పడుతుంది.
అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి గోగర్భం జలాశయం వరకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. నిన్న శ్రీవారిని 87,081 మంది దర్శించుకోగా, 41,575 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.05కోట్లు లభించింది.
కాగా, టీ టీ డీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సనాతన హిందూ ధర్మాన్ని విస్తరించడంలో భాగంగా కోటి భగ వద్గీత పుస్తకాలను తెలుగు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ముద్రించి విద్యార్థులకు ఫ్రీగా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే.. తిరుమలకు వచ్చే భక్తులు చిరుతల పట్ల భయపడాల్సిన అవసరం అస్సలు లేదని.. ఎవరూ ఆందోళన చెందకూడదని కోరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.