తనను ఓడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తనను టార్గెట్ చేసి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి సిడిఎఫ్ నిధులు ఇవ్వకుండా అభివృద్ధి అడ్డుకుంటున్నారని…119 నియోజకవర్గాల్లో ఒక్క ములుగుకే నిధులు రాలేదని మండిపడ్డారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
రూ.20 కోట్ల నిధులు ఇచ్చినట్లు మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్ర హించారు. రూ.20 వేలు కూడా ఇవ్వలేదని సీతక్క విమర్శించారు. మన నీళ్ళు,మన నిధులు మన నియామకాలు అనే నినాదం తో కుల,మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో అంక్రమ అరెస్టులు నిరసన తెలుపుతున్న వారి పైన దాడులు రోజు రోజుకు పెరుతున్న దుస్థితి ఆంధ్ర పాలకుల తీరు గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ప్రభుత్వానికి తగదు అని మండిపడ్డారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.