తమది సంక్షేమ ప్రభుత్వం అని అంటారు జగన్
కానీ అదే పనిగా పన్నుల వడ్డనలో ముందుంటారు
పోనీ వసూళ్లలో ఏమయినా పద్ధతి పాటిస్తున్నారా
అంటే..అదీ లేదు..ఎక్కడ చూసినా దౌర్జన్యాలే కనిపిస్తున్నాయి
ఈ తరుణాన ప్రజలు మళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపుతారా?
ఏమో ఎవరికి ఎరుక ! ఈ రాజకీయ చదరంగంలో ఏమయినా జరగొచ్చు!
………జగన్ అబద్ధాలే
చెబుతున్నారా..? బ్రదర్
పన్నుల వసూళ్లలో ఏపీ యంత్రాంగం తప్పులు చేస్తుందా ? ఇదీ మన లోకం న్యూస్ మీడియా ట్విటర్ లో నిర్వహించిన ఒపీనియన్ పోల్.. దీనిపై 66.7 శాతం మంది అవును అని, 33.3 శాతం అని స్పందించారు. అంటే ఏపీలో అధికారులదే తప్పు అని ఎక్కువ మంది తమ అభిప్రాయంను వెల్లడించారు.అయితే దీనిని వైసీపీ సర్కారు అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడొక మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి తమ ప్రభుత్వం నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని,దాదాపు మూడేళ్ల పాలనలో ఎక్కడా పన్నుల వడ్డన అన్నది లేనేలేదని అంటోంది.
తమది సంక్షేమ ప్రభుత్వం అని కూడా చెబుతోంది.ఇదే సందర్భంలో ప్రజల నుంచి విపరీతం అయిన విమర్శలు వస్తున్నాయి. గతం కన్నా భిన్నంగా చెత్త పన్ను విధించారని, యూజర్ ఛార్జీల పేరిట చేస్తున్న వసూలులో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్నో ఆధారాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. పోనీ చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లకు జీతాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు అని తేలిపోయింది.
జీతాలివ్వకపోయినా
పస్తులున్నా సరే పని చేయాల్సిందే !
రెండు నెలులుగా వీళ్లెవ్వరికీ జీతాలు లేవని అంటున్నారు.దీంతో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పోనీ పారిశుద్ధ్య కార్మికులకు సరిగా జీతాలు చెల్లిస్తున్నారా అంటే అది కూడా లేదని తేలిపోయింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చాలా మంది కాంట్రాక్టు కార్మికులకు, నగర కార్పొరేషన్ కు సంబంధించి విలీన పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇవాళ్టికీ వేతనాలు లేవు.
వీరి సమస్య ఎలా ఉన్నా కూడా బొత్స మాట్లాడుతున్న విధానం మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. వాస్తవాలను అంగీకరించే స్థితిలో అస్సలు లేరు. అంతేకాదు జప్తు నోటీసులు ఇవ్వడం అన్నది గతం నుంచి ఉన్నదేనని అంటున్నారాయన.అయినా పన్నులు చెల్లించకుంటే నోటీసులు ఇవ్వాలి కానీ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదన్న వాదన ఒకటి బలీయం అయి ఉన్న నేపథ్యంలో వైసీపీ ఏం చెప్పినా వినేందుకు ఇష్టపడడం లేదు పుర ప్రజలు.
– ట్విటర్ పోల్ – మన లోకం ప్రత్యేకం