పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది – ఉండవల్లి

-

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి కుమార్ ఘాటు కామెంట్స్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన తీర్మానం జరిగి ఇవాల్టికి పదేళ్లయింది..ఉమ్మడి రాజధాని, పోలవరం నేషనల్ ప్రాజెక్టు ఈ రెండింటినీ తీర్మానంలో ప్రస్తావించి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన చేశారని ఆగ్రహించారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నుండి ఒక్క ఏడాదిలోనే బయటకు వచ్చామని.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉందని ఆగ్రహించారు.

దుగరాజపట్నం పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కనీసం ప్రారంభించలేదని.. రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు..ఇప్పుడున్న ప్రభుత్వాలు రెండు కూడా మోడీ అనుకూలంగా ఉన్నాయని వివరించారు. కేంద్ర ఏం చేసినా గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార, ప్రతిపక్షాలు లేవని విమర్శలు చేశారు. వన్ పర్సెంట్ ఓట్లు లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది… వైఎస్ఆర్సిపి, టిడిపి బలం కేంద్రానికి ఉందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు…అసలు అవిశ్వాస తీర్మానాన్ని గట్టిగా ఎక్స్ పోజ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో మీ వాదన గట్టిగా వినిపించండి… కేంద్రానికి ఇంత త్వరగా సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు ఉండవల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version