వారం రోజుల పాటు వారాహి విజయ యాత్ర.. షెడ్యూల్‌ ఇదే

-

విశాఖలో వారాహి విజయ యాత్రపై నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించి….వారాహి విజయ యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు (11/08/2023) మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండను సందర్శిస్తారు. 12వ తేదీ(శనివారం): ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ ఉంటుంది.

సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. 13వ తేదీ(ఆదివారం) : వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14వ తేదీ(సోమవారం) ఉదయం: 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన భూములను సందర్శిస్తారు. 15వ తేదీ(మంగళవారం) మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 16వ తేదీ(బుధవారం) : విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు. 17వ తేదీ (గురువారం) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version