హిమాలయాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ … ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో వైరల్ !

-

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మరియు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ గా చేసిన “జైలర్” మూవీ నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు వెళుతోంది. ఇక ఈయన సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని చోట్ల అయితే నిన్న సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని సెలవులు కూడా ప్రకటించారు. అయితే తన సినిమా సక్సెస్ అవడంతో రజినీకాంత్ మూవీ టీం తో కలిసి సంతోషంగా ఉంటున్నారేమో అనుకుంటే పొరపాటు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హిమాలయాల్లో ఉన్నారు. ఎప్పుడు మనసుకు ప్రశాంత కావాలని అనిపించినా హిమాలయాల్లో ప్రత్యక్షము అవుతుంటారట. పైగా సినిమా షూటింగ్ లతో బిజీ గా సమయాన్ని గడిపిన రజినీ కొంచెం చేంజ్ కోసం హిమాలయాలకు వెళ్లారు.

అక్కడ తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ధ్యానం చేస్తూ స్నేహితులతో సమయాన్ని గడపడం ఆయనకు చాలా ఇష్టమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version