ఏపీ మహిళా ఛైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారు వాసిరెడ్డి పద్మ.వైసీపీ పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్ కు చెప్పారు వాసిరెడ్డి పద్మ. ఇక పార్టీ ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దమన్న వాసిరెడ్డి పద్మ.. తాజాగా ఏపీ మహిళా ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అయితే… ఆమె రాజీనామా చేయడంతో.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
జగ్గయ్యపేట నుంచి వాసిరెడ్డి పద్మ పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై ఆమె స్పందించారు. జగ్గయ్యపేట నా స్వస్థలం కనుక అక్కడ పోటీచేస్తా అనుకోవడం సహజం అన్నారు. పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామా కి కారణం కాదు….పోటీ చేయడమే గీటు రాయి కాదు.. అలా అని కొందరు అనుకుంటూ ఉండచ్చని తెలిపారు.బలా బలాల కారణంగా ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు….నాకు సీటొచ్చిందా లేదా అనేది ప్రాధాన్యత కాదని వెల్లడించారు. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా అన్నిటికీ సిద్ధమేనన్నారు.