చంద్రబాబు వైఖరిపై సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారా..? : వాసిరెడ్డి పద్మ,

-

చంద్రబాబు వైఖరిపై సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారా..? అని ప్రశ్నించారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని…బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని ఫైర్ అయ్యారు. బోండా ఉమ లాంటి ఆకురౌడీలకు మహిళ కమిషన్ సుప్రీమేనని…బాధితుల్ని పరామర్శించడం చంద్రబాబుకు తెలియదని నిప్పులు చెరిగారు.

 

బాధితురాలి మంచం దగ్గర కూడా 50 మంది ఉన్నారు…అత్యాచార బాధితురాలిని ఇలా పరామర్శిస్తారా..? అని ప్రశ్నించారు. అత్యాచారం జరిగితే రాజకీయం చేస్తారా..?రాజకీయం కన్నా మానవత్వం మరిచారనే సమన్లిచ్చామన్నారు. అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా…మహిళా కమిషన్ ఛైర్ పర్సనుపై ప్రవర్తించే తీరు ఇదేనా..? అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉన్న మహిళలకు నేను ప్రతినిధిని.. వాళ్ళకి నేనెలా సమాధానం చెప్పాలి..?సాక్షాత్తూ చంద్రబాబు సమక్షంలో బాధితురాలి విషయంలో రాజకీయాలు చేశారన్నారు. 27న చంద్రబాబు, బోండా ఉమ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి నాలుగు కోట్ల మందికి సమాధానం చెప్పాలి..ఏ చట్ట ప్రకారం మహిళా కమిషన్ ఉందో మీకు తెలీదా..? అని ప్రశ్నించారు.నా మీదే నిందలేస్తారా..? యుద్దానికి వచ్చారా..? పరామర్శకు వచ్చారా..? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version