పవన్ కళ్యాణ్ పై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ దత్త పుత్రుడు కాదు విష పుత్రుడంటూ నిప్పులు చెరిగారు. ఏపీలో మహిళల అదృశ్యంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించటం, దానిపై పవన్ కల్యాణ్ మళ్లీ స్పందించటం ఏంటని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో కొందరు ఎంపీలు మహిళల అదృశ్యంపై ప్రశ్నలు అడగటం వెనుక ఏ ఉద్దేశాలు ఉన్నాయని ప్రశ్నించారు.
వాలంటీర్లపై దుష్ప్రచారం చేసేందుకే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని.. మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్ కు చులకన భావం అంటూ మండిపడ్డారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలని కోరారు. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు.