ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు

-

హైదరాబాద్​లో చినుకు పడితే చిత్తడే. ఇక భారీ వర్షాలు కురిస్తే రహదారుల పరిస్థితి అంతే. వర్షం కురిసినప్పుడు కనుక బయటకు వస్తే.. మళ్లీ ఇంటికి చేరే వరకు ఏ అర్ధరాత్రో అవ్వడం ఖాయం. ఎందుకంటే అంతలా ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ. సాధారణంగా మామూలుగా ఉండదు ట్రాఫిక్ జామ్. ఇక వర్షాలు తోడైతే.. గంటలు గంటలు రోడ్లపై ఎదురుచూపులు తప్పవు. ఈ క్రమంలోనే వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో కంపెనీలకు ప్రత్యేక లాగౌట్​ను ఇటీవల సైబరాబాద్ సీపీ సూచించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ స్పెషల్ లాగౌట్ సమయాన్ని మరో 2 వారాలు పొడిగిస్తున్నట్లు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై కమిషనరేట్‌లోని పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌(పీఎస్‌ఐవోసీ)లో సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా కొన్ని చెరువుల్లో ప్రవాహ తీరు పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version