తిరుమల భక్తులకు అలర్ట్..ఇవాళ్టి నుంచి ఘాటు రోడ్లపై వాహనాల నిలిపివేత !

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. రేపు శ్రీవారి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. మాడవీధులలోని గ్యాలరిల ద్వారా 2 లక్షల మంది భక్తులు వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేశారు. తిరుమల చేరుకున్న ప్రతి భక్తుడికి స్వామివారి వాహన సేవను విక్షించేలా ఏర్పాట్లు చేసారు అధికారులు.

Vehicles will be stopped on Ghatu roads from today
Vehicles will be stopped on Ghatu roads from today

మాడవీధులలోని 5 ప్రాంతాల వద్ద వాహనం వద్దకు భక్తులును అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లులో ద్విచక్రవాహనాల నిలిపివేయనున్నారు అధికారులు. అటు నేడు నాల్గో రోజు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగానే నేడు శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు, అర్చకులు.

Read more RELATED
Recommended to you

Latest news