నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీసుకి నేను మేయర్ రెండు రోజులు క్రిందట వెళ్ళామన్నారు. సీటు మార్పు గురించి నా దగ్గర ఇప్పటివరకు అధిష్టానం ప్రస్తావించలేదని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
నేను విజయవాడ వెస్ట్ నియోజకవర్గ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారనేది ప్రచారం మాత్రమేనని చెప్పారు. నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని వివరించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నేను జగన్ నమ్ముకున్న వ్యక్తిని…అని.. జగన్ ఏం చెప్పినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపిస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.