పురుగుల కంటే హీనంగా ఎమ్మెల్యేలను జగన్ చూశాడు – రఘురామ

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అహంకారంతో అందరినీ దూరం చేసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. అమాయకత్వాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు భరిస్తారు కానీ అహంకారాన్ని ఎవరు సహించరని, ఈ ఐదేళ్లలో వ్యక్తిగతంగా కలుసుకోవడానికి పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి జగన్ మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఏ ఎమ్మెల్యేను, ఎంపీని కదిపి మనసు విప్పి మాట్లాడినా వారు కన్నీళ్లు పెట్టుకునేది ఒక్కటే తక్కువ అని… వారు అంత బాధతో మాట్లాడుతున్నారన్నారు.

ఎమ్మెల్యేలంటే పురుగుల కంటే హీనంగా జగన్ మోహన్ రెడ్డి చూశారన్నారు . నిన్న, మొన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక పది మంది ఎమ్మెల్యేలను జగన్ మోహన్ రెడ్డి గారు పిలిపించారని, ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలతో వేరువేరుగా ముఖాముఖిగా కేవలం 65 నుంచి 70 సెకండ్ల వ్యవధి పాటు మాట్లాడారని, ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖాముఖి 65 నుంచి 70 సెకండ్ల పాటు మాట్లాడడం అంటే ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాగే వ్యవహరిస్తే, రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని, ప్రతి ఒక్కరూ ఆత్మ గౌరవాన్ని కోరుకుంటారని, దానికోసమే రాజకీయాల్లోకి వస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news