కిడ్నీ బాధితులకు ఏపీ సర్కార్‌ శుభవార్త..

-

కిడ్నీ బాధితులకు ఏపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కిడ్నీ బాధితులందరికీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బాసటగా నిలుస్తున్నారని మంత్రి విడదల రజిని గారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు లో శనివారం డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆమె మాట్లాడుతూ కిడ్నీ బాధితులను జగనన్న ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు, మంచినీటి ప్రాజెక్టులు, పింఛన్లు పంపిణీ.. తదితర అంశాల ద్వారా తమ ప్రభుత్వం కిడ్నీ బాధితులకు అండగా నిలుస్తోందన్నారు. కిడ్నీ రోగులకు చంద్రబాబు చేసింది శూన్యమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ఎమ్మెల్యే రక్షణ నిధి గారు,ఫామిలీ వెల్ఫేర్ కమిషనర్ నివాస్ గారు,కలెక్టర్ ఢిల్లీ రావు గారు,మరియు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version