చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! ‘జాతి నేత’గా ఎందుకు మారారు? – విజయసాయి

-

పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి కౌంటర్లు పేల్చారు. చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు? అంటూ ఆగ్రహించారు విజయసాయి రెడ్డి. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బిజెపి నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో MPTC, ZPTCలను ఎందుకు పోటీ పెట్టలేదు? అని నిలదీశారు. అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా!

vijayasai reddy and purandeswari

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారని పేర్కొన్నారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కొంపదీసి ‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇదే కదా మీకు బిజెపి పట్ల ఉన్న చిత్తశుద్ధి!
వెనకటికి ఒకామె…ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news