నాకు క్యారెక్టర్ ఉందంటూ.. జగన్ కు విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంపై నిన్న జగన్ స్పందించారు. క్యారెక్టర్ ఉన్న వాళ్లే.. పార్టీలో ఉంటారని జగన్ చురకలు అంటించారు. అయితే… జగన్ కామెంట్స్.. పైన విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/jagan-vijayasai-reddy.jpg)
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని వెల్లడించారు విజయ సాయిరెడ్డి. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో… విజయసాయిరెడ్డిచేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025