చంద్రబాబు 100 రోజుల పనితీరు – పార్ట్ 2 ఇదే అంటూ విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. 100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 100 రోజుల్లో 60 అత్యాచారాలు జరిగాయని ఆరోపణలు చేశారు. 100 రోజుల్లో విజయవాడలో “ఐరన్ లెగ్” పాలనలో వరదల్లో 60 మందిని చంపేశారని.. వరద బాధితులకు కనీస సహయ సహకారాలు కూడా అందించలేదు. బాబు ఫోటోషూట్ తప్ప అంటూ సెటైర్లు పేల్చారు.
100 రోజుల్లో గుడ్లవల్లేరు కాలేజీ మహిళ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3 వేల వీడియోలు తీసారని… 100 రోజుల్లో విశాఖ ఉక్కు ను తుక్కు కింద మార్చేశారని ఆగ్రహించారు. వైజాగ్ ఆర్థిక వెన్ను ను చంద్రబాబు ప్రభుత్వం విరిచేసిందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ తుఫానులో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. 100 రోజుల్లో 10 వ్యాపార కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు….100 రోజుల్లో రోడ్లను నాశనం చేశారు, గుంతల పై తట్ట మట్టి కూడా వేయలేదన్నారు.