విజయసాయి ఎమోషన్… చనిపోయేవరకు జగన్‌ విధేయుడినే!

-

విశాఖ ఎల్జీపాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘటన సమయంలో జగన్, సంబంధిత మంత్రులు, విజయసాయి రెడ్డి మొదలైన నేతలు విశాఖకు వెళ్లినప్పుడు… జగన్ తన కారులోంచి విజయసాయిని కిందకు దింపేశారని ఒక వర్గం మీడియా కథనాలు వండి వడ్డించేసింది. జగన్ కు విజయసాయికి చెడిందంటూ స్పెషల్ ప్రోగ్రాంస్ వేసేసింది. అది కాదు కారణం… ప్రోటోకాల్ ప్రకారం మినిస్టర్ వెళ్లాలి కాబట్టి, జగన్.. విజయసాయిని దింపారు తప్ప మరొకటికాదని క్లారిటీ ఇచ్చినా కూడా ఆ కథనాలు ఆగలేదు. రకరకాల ఊహాగానాలు చేస్తూ… విజయసాయికి జగన్ కు చెడిందని, జగన్ విజయసాయికి ప్రాధాన్యత తగ్గించారని రకరకాల స్టోరీలు రాసేస్తున్నారు. దీంతో తాజాగా విజయసాయి స్పందించారు!

జగన్ కు విజయసాయికి మధ్య విభేదాలు వచ్చాయని వస్తోన్న కథానాలపై సాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను చనిపోయేవరకు సీఎం జగన్‌ కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. తనను ఎవరూ శంకించాల్సిన పనిలేదని.. సూటిగా సుత్తి లేకుండా తేల్చిపారేశారు విజయసాయి రెడ్డి. అనంతరం మరింత క్లారిటీ ఇచ్చిన విజయసాయి… తనకు, జగన్ కు ఎలాంటి విభేదాలు ఇప్పటివరకూ లేవు, ఇక ముందు రావు అంటూ స్పష్టం చేశారు!

అనంతరం నిమ్మగడ్డ – హైకోర్టు తీర్పు అంశాలపై మాట్లాడిన విజయసాయి… న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ, అగౌరవపరిచే ఉద్దేశం కానీ ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదని క్లారిటీ ఇచ్చారు! ఇదే క్రమంలో… నిమ్మగడ్డ రమేష్‌ కుమారే ఎస్‌ఈసీగా ఉండాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఏంటి? టీడీపీ ప్రభుత్వం లేకున్నా.. వాళ్ల మనుషులే ఉండాలనుకుంటున్నారా? రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంపై విషం కక్కడం ఎంతవరకూ సబబు? అంటూ విజయసాయి మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version