వాహ్‌.. నువ్వు సూపర్‌ బాసూ..!

-

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు నిన్న మొన్నటి వరకు తమ సొంతూళ్లకు వెళ్లలేకపోయారు. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో కార్మికులు సొంతూళ్లకు వెళ్తున్నారు. చేతిలో డబ్బులు లేని వాళ్లకు దాతలు సహాయం చేస్తున్నారు. ఇక కొందరైతే సైకిళ్లపై, కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తన కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు ఏకంగా ఓ వ్యక్తికి చెందిన బైక్‌నే దొంగిలించాడు. అయితే.. ఆ బైక్‌ను అతను ఓనర్‌కు తిరిగి పార్సిల్‌ చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో చిన్న టీ స్టాల్‌ నడుపుకునే ప్రశాంత్‌ అనే వ్యక్తి అక్కడికి సుమారుగా 268 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావురుకు తన కుటుంబ సభ్యులను తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే అతని చేతిలో డబ్బులు లేవు. దీంతో అతను కోయంబత్తూరుకు సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ బయట పార్క్‌ చేయబడి ఉన్న బైక్‌ను దొంగిలించాడు. ఈ క్రమంలో కొంత సేపటికి బయటికి వచ్చిన బైక్‌ ఓనర్‌ కుమార్‌కు తన బైక్‌ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు కంప్లెయింట్‌ చేశాడు. అయితే పోలీసులు కరోనా లాక్‌డౌన్‌ డ్యూటీల్లో ఉండడంతో తన బైక్‌ ఇప్పుడప్పుడే దొరుకుతుందో, లేదోనని భావించిన కుమార్‌ దాన్ని తానే ట్రేస్‌ చేయాలని అనుకున్నాడు.

అందులో భాగంగానే కుమార్‌ బైక్‌ దొంగిలించబడిన ప్రాంతంలో ఉన్న ఓ సీసీటీవీ ఫుటేడ్‌ చూశాడు. అందులో ప్రశాంత్‌ బైక్‌ను దొంగిలించినట్లు కనిపించింది. అతని గురించి ఎంక్వయిరీ చేసిన కుమార్‌ అతని టీ స్టాల్‌, లోకల్‌గా అతను ఉండే ఇంటి వద్దకు కూడా వెళ్లాడు. అయితే అప్పటికే అతను తంజావూరుకు వెళ్లిపోయాడు. దీంతో కుమార్‌ ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చేశాడు. అయితే కొద్ది రోజుల తరువాత స్థానికంగా ఉండే ఓ పార్శిల్‌ సర్వీస్‌ ఆఫీస్‌ నుంచి కుమార్‌కు కాల్‌ వచ్చింది. వెళ్లి చూడగా.. ప్రశాంత్‌ ఆ బైక్‌ను పార్శిల్‌లో పంపించినట్లు గుర్తించాడు. ఈ క్రమంలో కుమార్‌ రూ.1400 లగేజీ చార్జి చెల్లించి బైక్‌ను తీసుకున్నాడు. దీంతో కుమార్‌కు కూడా ఆశ్చర్యం వేసింది. ప్రశాంత్‌ తనకు ఎమర్జెన్సీ ఉండి బైక్‌ను తీసుకెళ్లాడులే అని అతను భావించాడు.. అవును మరి.. కేవలం నిజాయితీ ఉన్న వ్యక్తులే ఇలా చేస్తారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version