కులం, మతం అంటూ అగ్గి రాజేసి..చలి కాపుకో అంటూ సీఎం చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి…నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే మనకేంటి, పెరగకపోతే మనకేంటి…అనేదే చంద్రబాబు నైజం అన్నారు. టమాటా 100 అయితే మనకేంటి, 200 అయితే మనకేంటి… ఇసుక టన్ను 2000 అయితే మనకేం, 4000 అయితే మనకేంటి అని చంద్రబాబు అనుకుంటున్నారని సెటైర్లు పేల్చారు.

మరో 4 సంవత్సరాల తర్వాత ప్రజలకి దొంగహామీలిచ్చి, మభ్యపెట్టి, మోసగించి, ఓట్లు వేయించుకోవచ్చు! మనకి కావాల్సింది రాష్ట్రాన్ని దోచుకోవడం, కులం, మతం అంటూ అగ్గి రాజేసి అందులో చలి కాపుకోవడమే అంటూ ఆగ్రహించారు. రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు జీఓ విడుదల అయింది. కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాసింది. టీవీల్లో రోజంతా బ్రేకింగు న్యూస్ నడిచాయి. నిధులు మాత్రం హుళక్కి. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయన్నారు.