ప్రకాశం: ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో బేటి అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆదివారం హైదరాబాద్ లోని బాలినేని నివాసానికి వెళ్లారు విజయసాయిరెడ్డి. వీరిద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. గత రెండు నెలల క్రితం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం జగన్ బాలినేనిని రెండుసార్లు పిలిచి మాట్లాడారు.
ఇక ప్రస్తుతం విజయసాయిరెడ్డి.. బాలినేని ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ భేటీలో వీరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ పరిస్థితిలపై సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. పలు నియోజకవర్గాలలో మార్పులు, చేర్పులపై ప్రధానంగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో త్వరలోనే భారీ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.