ఏపీ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంపై విజయసాయి సంచలన పోస్ట్

-

ఏపీ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంపై విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో (వాటిని కౌంటీలు అని పిలుస్తారు) దేశ జనాభాలో కేవలం 20 శాతం జనమే నివసిస్తున్నారని తెలిపారు. పట్టణాలు, నగరాలకు దూరంగా ఉండే ఈ ప్రాంతాల్లో 80 శాతం ప్రజలకు అవసరమైనన్ని వైద్య సౌకర్యాలు లేవని అమెరికా కేంద్ర (ఫెడరల్‌ ) ప్రభుత్వం భావిస్తోందని…. ఈ కౌంటీల్లో దేశ ప్రజల్లో 20% నివసిస్తున్నాగాని మొత్తం డాక్టర్లలో కేవలం పది శాతం మందే అక్కడ ప్రాక్టీసు చేస్తున్నారని చెప్పారు. వైద్యసేవలు అరకొరగా అందిస్తున్నారు. అంటే డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా పట్టణ, నగర ప్రాంతాల్లోనే నివసిస్తూ వైద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఇష్టపడతారనేది జగమెరిగిన సత్యం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో గ్రామీణ కౌంటీలలో ప్రాథమిక వైద్య సేవలందించే డాక్టర్ల సంఖ్య అక్కడి జనాభాతో పోల్చితే బాగా తగ్గిపోయిందని అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్‌ యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇకనామిక్స్‌ స్కాలర్లు గత ఏడాది చేసిన అధ్యయనంలో తేలింది. ఈ సర్వేకు సంబంధించిన ఏడేళ్ల కాలంలో గ్రామీణ కౌంటీల్లో ప్రాథమిక వైద్యుల సంఖ్య తగ్గిపోగా, నగర (మెట్రోపాలిటన్‌ ఏరియాలు) ప్రాంతాల్లో డాక్టర్ల సంఖ్య పెరిగిందని చెప్పారు సాయిరెడ్డి. మొత్తంమీద అమెరికాలో డాక్లర్ల సంఖ్య అవసరమైన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, కొన్ని ప్రాంతాల్లో వైద్యులు మరీ తక్కువగా ఉండడం పెద్ద లోపంగా ప్రభుత్వాధికారులు గుర్తించారు. నగర, పట్టణ ప్రాంతాల ప్రజలతో పోల్చితే గ్రామీణ కౌంటీల్లోని జనానికి గుండె జబ్బులు, కేన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, అన్ని రకాల స్ట్రోకులు ఎక్కువ పీడిస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. అగ్రరాజ్యానికి సంబంధించిన ఈ సమస్య గురించి ఇక్కడ వివరించడానికి కారణాలు లేకపోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news