ఏపీ బీజేపీ పార్టీ చీఫ్ పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” అంటూ పురందేశ్వరికి చురకలు అంటించారు సాయిరెడ్డి. అమ్మా, పురందేశ్వరిగారు…బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్… వదినది డైలాగ్! అంటూ సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి.
తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్! మీ నాన్నగారు మహానటులు… మీరు కాదనుకున్నామని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే అంటూ మండిపడ్డారు.
కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు…వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుందని పురందేశ్వరిని ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
అమ్మా, పురందేశ్వరిగారు…బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్… వదినది డైలాగ్! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!
మీ నాన్నగారు మహానటులు… మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన… pic.twitter.com/5ZJnpdxqWQ— Vijayasai Reddy V (@VSReddy_MP) July 30, 2023