ఓటమి నుంచి మరో ఓటమికి… చంద్రబాబు రాజకీయ యాత్ర – విజయసాయి రెడ్డి

-

ఓటమి నుంచి మరో ఓటమికి… చంద్రబాబు రాజకీయ యాత్ర అంటూ విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు నుంచే తెలుగుదేశం, ఈ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరాజక పోకడలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ లో బాధ్యతాయుత ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన టీడీపీ గత మూడున్నరేళ్లలో ఏనాడూ రాష్ట్రంలో జరుగుతున్న మంచి గురించి మాట్లాడలేదన్నారు.

ప్రజాసంక్షేమ పథకాలేవీ చంద్రబాబుకు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయక్వంలోని ప్రభుత్వంపై 2023 సంవత్సరం మొదటి రోజు నుంచే చంద్రబాబు గుంటూరులో దుష్ప్రచారం ప్రారంభించారు. తన బహిరంగ సభలకూ, రోడ్‌ షోలకూ జనం వస్తున్నారని చెప్పుకుంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పి వారిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా మార్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు.

దీంతో పాలకపక్షంపైనా, ప్రభుత్వంపైనా టీడీపీ విషప్రచారం రెట్టింపవుతోంది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపల్, పంచాయతీ రోడ్లపై బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే–ఇదేదో చట్ట వ్యతిరేక చర్యగా టీడీపీ గగ్గోలు పెడుతోంది. విశాల ప్రజానీకం నిరంతరం ఉపయోగించే రోడ్డు మార్గాలపై సభలు, సమావేశాలు పెట్టడాన్ని పూర్తిగా నిషేధించలేదన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి ర్యాలీలకు అనుమతులు ఇస్తామని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో ప్రకటించినా చంద్రబాబు బృందం ఆంధ్రప్రదేశ్‌ లో కొంప మునిగినట్టు గోల చేస్తోందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version