విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్…దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

-

Vijayawada Durgamma Devotees Alert Durgagudi Ghat Road Closure: విజయవాడకు వెళ్లే దుర్గమ్మ భక్తులకు బిగ్‌ అలర్ట్. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా నిన్న రాత్రి నుంచే విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు.

Vijayawada Durgamma Devotees Alert Durgagudi Ghat Road Closure

మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని చెబుతున్నారు ఆలయ అధికారులు. అయితే… ఆషాఢం సారె సమర్పణ కోసం వస్తున్న భక్తులతో నిలిచింది ట్రాఫిక్. దీంతో విజయవాడ అమ్మవారి భక్తులు…ఇబ్బందులు పడుతున్నారు.

ఇక అటు ఇంద్రకీలాద్రి కొండచరియల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కొండచయలు విరిగిపడకుండా ఒక గోడ నిర్మాణం, సిమెంటింగ్ చేసి మట్టి జారకుండా ఏర్పాటుకు ప్రతిపాదించారు నిపుణులు. ఇక నిపుణుల సలహాను ఆమోదించిన దేవాదాయ శాఖ… రెండు రోజుల్లో ప్రారంభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version