పోలవరం ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం.. రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని తెలిపారు. పోలవరంతో కొత్తగా 7లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. 28 సార్లు క్షేత్ర స్థాయికి వచ్చాను. 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2019లో బలవంతంగా నోటీసులు ఇచ్చి సైట్ లోనుంచి వెల్లిపోవాలని ఆదేశాలు ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో 50లక్షల క్యూసెక్కుల వాటర్ కి నిర్మాణం చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. డయా ఫ్రం వాల్ కట్టి వదిలిపెట్టామని తెలిపారు. మా హయాంలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే నీటి సమస్య ఉండదని తెలిపారు సీఎం చంద్రబాబు. ఆగస్టు-అక్టోబర్ 2020లో వరదల వల్ల డయా ఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి, కుట్రలు కలిపి ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారని తెలిపారు సీఎం చంద్రబాబు.