తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. నల్గొండ జిల్లాలో అనుమతి లేకుండా నెలల పాటు విధులకు… గైర్హాజరు అయిన… వారిపై చర్యలు తీసుకుంది. నెలలుగా విధులకు హాజరు కాని 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును… బ్రేక్ చేసారు నల్గొండ జిల్లా కలెక్టర్.
దీంతో గైర్ హాజరు అయిన కాలానికి సంబంధించిన సర్వీసు వారు కోల్పోబోతున్నారన్నమాట. దీనివల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ అలాగే ఇంక్రిమెంట్లు, పెన్షన్ విషయంలో వారికి తీవ్ర నష్టం వాటిల్లి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ 99 పంచాయతీ కార్యదర్శిలను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. కాకపోతే స్థానాచలనం చేశారు. ఇక ఈ 99 మంది పంచాయితీ కార్యదర్శులపై యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో మిగతా కార్యదర్శులు కూడా అలర్ట్ అవుతున్నారు. సెలవులు పెట్టకుండా రెగ్యులర్గా డ్యూటీకి వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు.