ఏపీ ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్ ను భుజానమోయడం సిగ్గుచేటు – విష్ణువర్ధన్ రెడ్డి

-

ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విశాఖ ఉక్కు పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కెసిఆర్ ని దేవుడు అని పొగుడుతున్న లక్ష్మీనారాయణ, ఆంధ్ర నాయకులను విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కెసిఆర్ అజెండాను ఏపీలో అమలు చేసేందుకు కొందరు నాయకులు సిద్ధమయ్యారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

సీమ నీళ్లను దోచుకుంటున్న, ఆంధ్ర ఆస్తులను కాజేస్తున్న కేసీఆర్ ను భుజానమోయడం సిగ్గుచేటని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో ఆంధ్ర ప్రదేశ్ కి కూడా వాటా ఉందని తెలిపారు. ఆ విషయంలో ఆంధ్ర నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. లేని సమస్యలను సృష్టిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. జెడి లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గురించి జయప్రకాశ్ నారాయణ ను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version