ట్రాన్స్ జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

-

ట్రాన్స్ జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికోసం ప్రత్యేక పాలసీని అమలులోకి తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లకు విద్యా, వైద్యం సామాజిక భద్రత అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. ఇందుకోసం బడ్జెట్ లో రెండు కోట్లు కేటాయించింది. వారికి సామాజిక భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని అమలు చేయనుంది.

నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారికి ప్రత్యేకంగా మరికొన్ని చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. వాళ్లు నివసించే ప్రాంతాలలో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలను కల్పిస్తుంది. అలాగే వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version