దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగతం అని.. దానికి రాజకీయాలతో సంబంధం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు తెలిపారు. వెన్నెముకలో విప్ లాష్ గాయంతో బాధపడుతున్నా. కానీ సుమారు నాలుగున్నరేళ్ల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కుల్ని తీర్చుకోవడం కోసం ఆరోగ్యం సహకరించకున్నా రావాల్సి వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నాను అని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలయాలను సందర్శిస్తుండటంతో పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సమాచారం సరిగ్గా తెలియకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తి గత విషయాలకు రాజకీయాలు జోడించడం కరెక్ట్ కాదని వెల్లడించారు.