వివేక హత్య కేసు.. గంగిరెడ్డికి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి కి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు సిజెఐ జస్టిస్ చంద్రచూడ్. బెయిల్ ని రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు ప్రధాన న్యాయమూర్తి. అసలు ఇది ఎలాంటి ఉత్తర్వులు అంటూ తల పట్టుకున్నారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మసనం. విచారణ వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది. దీనిపై వచ్చేవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.

నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సునీత రెడ్డి. సునీత పిటిషన్ పై విచారణ జరిపారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. గంగిరెడ్డి కి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జూలై 1న మళ్లీ విడుదల చేయాలని సిబిఐ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సునీత రెడ్డి. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయని, సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీత రెడ్డి తన పిటీషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version