కేసీఆర్ జర్నలిస్టులను మోసం చేశారు – వైఎస్ షర్మిల

-

ఇందిరాపార్క్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న మహా ధర్నాలో పాల్గొన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసుల చేత తన పైన కూడా కేసు పెట్టించారని.. TSPSC పేపర్ లీకుల విషయంలో కేసీఆర్ ను తప్పు పడితే కేసు పెట్టారని చెప్పారు. అలాగే TSPSC లో IT శాఖను విమర్శ చేశామని కేసు పెట్టారని అన్నారు.

మాకు కేసులు కొత్తేం కాదని అన్నారు షర్మిల. కేసీఅర్ ఒక నియంత.. దేనికి బయపడం అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. “జర్నలిజంకి నా సలాం. జర్నలిస్టులకు సలామ్. ప్రజలకు, ప్రతిపక్షాలకు గొంతు మీరు. జర్నలిస్ట్ అనే వాల్లు లేకుంటే సమస్యలు బయటకు రావు. 9 ఎండ్ల బంగారు తెలంగాణలో జర్నలిస్టులు ఆందోళన చేయడం బాధాకరం. జర్నలిస్టులు సన్మానం చేయమని అడగలేదు. కేవలం వాళ్లకు రావాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారు. కేసీఅర్ జర్నలిస్టులను విస్మరించడం అన్యాయం.

YSR హయాంలో జర్నలిస్టులకు ఎంతో నాయ్యం జరిగింది. YSR హయంలోనే 70 ఎకరాలు జవహర్ లాల్ హౌజింగ్ సొసైటీకి కేటాయించారు. అది కాస్త కేసుల్లో ఇరుక్కుంది. వైఎస్సార్ మరణం తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ కానీ.. ఇప్పుడు కేసీఅర్ కానీ పట్టించుకోలేదు. వైఎస్సార్ హయాంలో జిల్లాల్లో కలెక్టర్ల చేత ఎంతో మందికి ప్రభుత్వ స్థలాలు ఇప్పించారు. విద్య, వైద్యంలో పెద్ద పీట వైఎస్సార్ వేశారు.

CMRF నుంచి ఎంతో మంది జర్నలిస్టులను ఆదుకున్నారు. వైఎస్సార్ ఎంతో చేస్తే కేసీఅర్ మాత్రం జర్నలిస్టులను మోసం చేశారు. సొసైటీలో భూముల కేసు సుప్రీం కోర్టులో గెలిచినా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి చిత్త శుద్ది లేదు. అందరికీ వరాలు ఇచ్చినట్లే.. జర్నలిస్ట్ లను కేసీఅర్ మోసం చేశాడు” అని మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version