విశాఖ సాయి ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్!

-

విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన సాయి ప్రియ, ఆమె ప్రియుడు రవితేజ పై కేసు నమోదయింది. జులై 22న విశాఖ బీచ్ లో సాయి ప్రియ కనిపించకుండా పోయారు. ఈ విషయమై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం నేవీ, సముద్ర తీరంలో గస్తీ దళం ముమ్మరంగా గాలించాయి. కానీ సాయి ప్రియ బీచ్ నుండి ప్రియుడితో పరారై అందరిని తప్పు ద్రోవ పట్టించారు.

ప్రభుత్వ ధనం, సమయం వృధా చేసినందుకు సాయి ప్రియ ఆమె ప్రియుడుపై కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి ప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు, నేవీ కోస్ట్ గార్డ్ పోలీసుల సమయం వృధా అయ్యిందంటున్నారు పోలీసులు.

పైగా భర్త ఉండగానే అతడిని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు అనుమతించాలంటూ త్రీటౌన్ సిఐ కె.రామారావు కోర్టును కోరారు. కోర్టు అనుమతించడంతో సాయి ప్రియ, రవితేజ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version