రేపే ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం.. పకడ్బందీగా ఏర్పాట్లు

-

ఈనెల 11వ తేదీన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి సీతారామకళ్యాణ ఉత్సవం రంగరంగ వైభవంగా జరగనుంది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ శుక్రవారం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరఫున ఆయన రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో  శ్యామలరావు తెలిపారు.

ఎండలు మండిపోతున్న దృష్ట్యా స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు కల్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్ర‌సాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించనున్నట్లు చెప్పారు. ఇక  పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో, జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్యామల రావు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news