HCU భూములపై కేంద్ర సాధికార కమిటీకి బీఆర్ఎస్ నివేదిక

-

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వ్యవహారంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ భూమిని పరిశీలించేందుకు హెచ్‌సీయూకు పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కమిటీ.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. అయితే ఈ కమిటీని బీఆర్ఎస్ నేతలు కలిశారు.

కేంద్ర సాధికార కమిటీతో హరీశ్‌ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక సమర్పించింది. డాక్యుమెంట్లు, విజువల్స్‌ను కమిటీకి సమర్పించినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అటవీ శాఖ స్పందించకపోవడం వల్లే HCU పరిధిలోని చెట్లు నరికేశారని హరీశ్ రావు అన్నారు. అందువల్లే జంతువులు మృత్యువాత పడ్డాయని ఆరోపించారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏం పాటించకుండా ఆ భూముల్లోకి బుల్డోజర్లను పంపిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news