Water from Handri-Neeva Project to be released today: రాయలసీమకు గుడ్ న్యూస్.. నేడు హంద్రీనీవాకు నీళ్లు విడుదల కానున్నాయి. హంద్రీనీవా సుజాల స్రవంతి కాలువ ఫేజ్-1 విస్తరణ పనులు ముగిసాయి. ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచగా…40 TMC లను మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ పనులను వేగంగా పూర్తి చేయగా ఇవాళ నంద్యాల జిల్లా నందికొట్కూర్ మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారు.

ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగు, త్రాగునీరు అందుతాయి. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నీటి కోరత ఉండేదని ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవని రైతులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరిన్ని మంచి మంచి పనులను చేయాలని కోరుతున్నారు.