ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 21న కాలేజీలు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం నిర్ణయించింది. డ్యూయల్ మేజర్ డిగ్రీ అమలు చేయాలనే డిమాండ్ తో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.

వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే నిరసన తెలుపుతామని అధికారులు హెచ్చరించారు. డిగ్రీ ప్రవేశాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నేడు ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నాకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.