ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం : సీఎం చంద్రబాబు

-

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్గీకరణ బిల్లుకు ఆమోదం పలుకుతున్నట్టు తెలిపారు. గతంలో ఎస్సీల పట్ల దారుణంగా వ్యవహరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లాల వారిగా కేటగిరి చేయాల్సి ఉంది. జనగణన పూర్తి చేశాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపడుతామని తెలిపారు సీఎం చంద్రబాబు.

ఎస్సీలు గతంలో బోరు, బావి వద్ద నీరు తీసుకునే పరిస్థితి కూడా లేదు. రెండు గ్లాసుల పద్దతి ఉండేది. దళితులను దేవాలయాలకు వెళ్లనిచ్చేవారు కాదు. కులవివక్ష పై యుద్ధం చేశామని తెలిపారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి నుంచి రాస్ట్రంలో కులవివక్ష పై జస్టీస్ పున్నయ్య రిపోర్టు అమలు చేశామని తెలిపారు. గిరిజనుల భూములను కూడా వేరే వారు ఆక్రమించుకునేవారు. దారుణ పరిస్థితులుండేవి. 

Read more RELATED
Recommended to you

Latest news