తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా పోలీసుల అత్యుత్సాహం తగడం లేదన్నారు. ప్రతిపక్షం ఎక్కడ పర్యటించినా జగన్ గుండెల్లో భయం పుడుతుంది అన్నారు. నారా లోకేష్ గారి పలాస పర్యటనను అడ్డుకోవడమ్ ,అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు శ్రీనివాసరెడ్డి.
ఏ పర్యటన కు వెళ్లినా ప్రభుత్వ వైఖరి,పోలీసుల వైఖరి స్పష్టంగా కనపడుతుందన్నారు. అక్రమ అరెస్ట్ లు ఎప్పుడు లేవు,ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ దుర్మార్గపు చర్యను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారని.. నారా లోకేష్ గారి అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ జగన్ ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.